ఉప్పెనంత అల
ఉక్కిరి బిక్కిరి
ఉపిరాడ్డం లేదు
ఈడ్చుకుపోతోంది అగాధనీలిమలోకి
ఎవరైనా కాపాడండి !
..వద్దొద్దు
బావుంది ఇలా చచ్చిపోవడం
నమస్తే అన్నా..నమస్తే అక్కా..నమస్తే,నమస్తే..
ఏమైంది వంగపండు కి?
ఏమైంది వేణుకి?
ఏమైంది ఖదీర్ కి , వనజ కి , కొణతం దిలీప్ కి ?
ఎక్కడ మునిగి , ఎక్కడ తేలారు ? తేలారా, మునిగారా ?
ఓహ్ , ఎటువంటి కాలం ఇది .. ఎంత వింత దృశ్యాలని కనుల ముందు వుంచుతోంది.. అడవులు, అమరత్వము, వెన్నెలా, కడలి హోరు.. అంతా అబద్ధమేనా ? నిజంగా అబద్ధమేనా? దేన్ని నమ్మారు, దేన్ని నటించారు? దేన్ని పంచారు ప్రపంచానికి ? మీ ఉరకలెత్తే అక్షరాన్ని.. ప్రశ్నల పిడుగులు కురిసే ఉపన్యాసాన్ని..పచ్చని పైరులా హృదయాన్ని తాకే పాటని.. దేన్ని నమ్మాలి ఇప్పుడు?
మన్నించండి మిత్రులారా, మన్నించండి. మిమ్మల్ని మనసారా నమ్మిన సమస్త ప్రపంచం ముందు దయచేసి సాగిలపడి మన్నించండి. వేదనతో, దిగులుతో, దుఖంతో, భయంతో, ద్వేషంతో రగిలిపోతున్న ప్రమంచం ముందు మోకరిల్లి మన్నించమని ప్రార్ధించండి.
ప్రియ వీరుడా.. అవును నిజమే, అరచేతిలో ఇంకా ఆరని నెత్తుటి తడి స్పర్స వెచ్చగానే వుంటుంది. నల్ల గొంగడి కింద గుస గుసగా పిలిచే పిలుపు చల్లగానే వుంటుంది . బిక్ష గా దక్కిన ప్రాణం కృతజ్ఞత తో తల్లడిల్లుతూనే వుంటుంది. రహస్య సాయం బదులు తీర్చుకో మంటుంది.
నా ప్రియమైన మిత్రులారా .. ముసుగు తొలగింది. ఇప్పుడిక హాయిగానే వుండవచ్చు , ఏ నమ్మకాలని నమ్మనవసరం లేకుండా. తండ్రులారా ధన్యవాదాలు, మా కళ్లు తెరిపించినందుకు.

Subscribe to:
Posts (Atom)