వాన వరదెత్తింది
కరువు మీద కసి తీర్చుకుంది
పుడమి కడుపులోంచి పచ్చని మొలక తొంగి చూసింది
హృదయంలోకి వెచ్చగా వేళ్ళు దిగాయి
రెప్పలు దాటిన జలపాతాలు జల జలా దూకాయి
దుఖమో , సంతోషమో !
హఠాత్తుగా ఉప్పెన విరుచుకుపడింది
బీడుబడ్డ దేహం ప్రేమోద్వేగంతో రెప రెప లాడింది
ఉపిరాడని క్షణాలను కాంక్షగా పెనవేసుకుంది
మహా ప్రవాహం సుడి తిరిగింది
సమస్త సంతోషాలనీ వడిలాక్కుంది